తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతగా సమ్మెకు నాయకత్వం వహించిన అశ్వద్దామరెడ్డికి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. జేఏసీ నేతగా వ్యవహరించిన అశ్వద్దామరెడ్డి ఒక ఆర్టీసీ డ్రైవర్ గా తిరిగి స్టీరింగ్ పట్టాల్సి వచ్చింది. కేవలం అశ్వద్దామరెడ్డికే కాదు. ఆర్టీసీలో యూనియన్లకు హెచ్చరిక చేసింది. యూనియన్ కార్యాలయాలకు కేటాయించిన భవనాలకు తాళాలు వేసి స్వాధీనం చేసుకుంది. నేతలకు ఉన్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేసింది. యూనియన్ నేతలకు వేతనంతో కూడిన సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి యూనియన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించటంతో..ఆర్టీసీ వీరి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మరిన్ని చర్యల దిశగా కసరత్తు చేస్తోంది.

#AshwathamaReddy
#Tsrtc
#kchandrasekharrao
#kcr
#trs
#telanganagovernment
#cmkcr
#cabinetmeeting
#TsrtcEmployees
#TSRTCNews
#hyderabad
#andhrapradesh